క్లాస్ లుక్‌లో ఊరమాస్ నాని.. ఫుల్ మీల్స్ పక్కా!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని టక్ చేసుకుని, ముందు భోజనం పెట్టుకుని కూర్చున్నాడు. వెనకాల నుండి ఓ కత్తిని తీస్తూ నాని ఇచ్చిన పోజు వెరైటీగా ఉండటంతో ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని పాత్ర పేరు జగదీష్ నాయుడుగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాతో నాని అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

టక్ జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.