అందం అంతా ఆ కాళ్లలోనే ఉందని కామెంట్స్

Pooja in Gym

స్టార్ హీరోయిన్స్ దాదాపు అంతా కూడా రోజులో కనీసం రెండు నుండి నాలుగు గంటల పాటు జిమ్ లో వర్కౌట్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ తమ ఫిజిక్ ను అలా మెయింటెన్ చేసేందుకు ఇంకెంత కష్ట పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూజా హెగ్డే జిమ్ లో ఏ రేంజ్ లో కష్టపడుతుందో ఈ ఫొటోను చూస్తుంటేనే అర్థం అవుతుంది. ముద్దుగుమ్మ పూజా హెగ్డే వర్కౌట్స్ అంటూ ఏకంగా జిమ్నాస్టిక్స్ చేస్తుంది. రెండు కాళ్లు అలా పూర్తిగా స్ట్రెస్ చేయడం అనేది అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. అది కూడా ఒక కాలు కింద ఉంచి మరో కాలు పైన పెట్టి స్ట్రెస్ చేయడం చాలా మంది హీరోలకు కూడా సాధ్యం అవ్వక పోవచ్చు. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడి ఈ ఫోజ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. పూజా అందం అంతా ఆ కాళ్లలోనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/