హోటల్ లో రమ్య కు అడ్డంగా దొరికిన నరేష్ – పవిత్ర ..

గత నాల్గు రోజులుగా మీడియా లో సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర ల బంధం గురించి అనేక రకాలుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి తెరపైకి వచ్చారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి సిద్ధమవుతున్నాడంటూ ఆరోపణలు చేశారు. న‌రేష్ టేబుల్‌పై గ‌న్ పెట్టి బెదిరించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో నరేష్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. రమ్య ఏనాడు త‌న భార్యలా ప్రవ‌ర్తించ‌లేద‌న్నాడు న‌రేష్‌. కేవలం డబ్బుల కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్‌కి దిగిందన్నాడు.

హైద‌రాబాద్‌లోనూ ఇలాగే చేసిందని.. ఇప్పుడు బెంగుళూరు మొద‌లు పెట్టిందన్నాడు. అల‌ర్ట్ చేయ‌డానికే తాను బెంగుళూరు వ‌చ్చానని చెప్పాడు. తాను రెండు వంద‌ల సినిమాల్లో న‌టించానని.. వంద మంది హీరోయిన్స్‌కి పైగా తనతో కలిసి న‌టించారని.. ఒక మ‌హిళ అయినా తాను వారిని ఛీట్ చేశార‌ని చెప్పడం గ‌మ‌నించారా..? అని ప్రశ్నించారు. రమ్య టార్చర్ తట్టుకులేక రూ.10 లక్షలు ఇచ్చానని.. ఆ డ‌బ్బులు తీసుకుని ఇప్పుడిలా మాట్లాడుతోందని ఆరోపించాడు. ఇదిలా ఉంటె తాజాగా నరేష్ – పవిత్ర లు మైసూర్ లోని ఓ హోటల్ లో రమ్య కు అడ్డంగా దొరికారు.

మైసూర్ లో ఓ హోటల్‌లో వీరిద్దరూ ఉన్న విషయం తెలుసుకున్న రమ్య.. అక్కడికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర, నరేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవిత్రను ఆమె చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. రమ్యను పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేష్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో , పిక్స్ హల్‌చల్ అవుతున్నాయి.