నాని తో కీర్తి లిప్ లాక్..?

నేచురల్ స్టార్ నాని – మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన నేను లోకల్ మూవీ యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దసరా మూవీ తో మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే.

అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కాగా ఈ మూవీ లో నాని – కీర్తి సురేష్ ల మధ్య ఓ రొమాంటిక్ లిప్ లాక్ ఉందట..ఆ లిప్ లాక్ సన్నివేశం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.వాస్తవానికి కీర్తి లిప్ లాక్ సన్నివేశాలకు , భారీ అందాల ఆరబోత కు చాల దూరంగా ఉంటుంది. కానీ సర్కార్ వారి పాట నుండి తన హద్దులను చెరిపివేసినట్లు పక్కాగా తెలుస్తుంది. లిప్ లాక్ చేయను , అందాల ఆరబోత చేయను అంటే ఛాన్సులు ఇవ్వడం లేదు దర్శక ,నిర్మాతలు..అందుకే కీర్తి కూడా మిగతా హీరోయిన్ల మాదిరి చూపించడం చేస్తుంది. మరి ఈ దసరా అమ్మడికి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.