వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబదించిన లిస్ట్ ను అధికారిక ప్రకటన చేసింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. కాగా, 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.

అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

నార్తు రామారావు (బీసీ యాదవ, ఇచ్ఛాపురం)

కుడిపూడి సూర్యనారాయణ (బీసీ శెట్టిబలిజ, అమలాపురం)

వెంక రవీంద్రనాథ్ (ఓసీ కాపు, తణుకు)

కావూరు శ్రీనివాస్ (బీసీ శెట్టిబలిజ, పాలకొల్లు)

మేరుగ మురళీధర్ (ఎస్సీ మాల, గూడూరు)

సిపాయి సుబ్రహ్మణ్యం (బీసీ వెన్నెరెడ్డి, శ్రీకాళహస్తి)

పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ రెడ్డి, జమ్మలమడుగు)

మధుసూదన్ (బీసీ వాల్మీకిబోయ, ఆదోని)

ఎస్.మంగమ్మ (బీసీ వాల్మీకబోయ, పెనుగొండ)

ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు :

పెన్మత్స సూర్యనారాయణరాజు (ఓసి క్షత్రియ, నెల్లిమర్ల)

పోతుల సునీత (బీసీ పద్మశాలి, చీరాల)

కోలా గురువులు (బీసీ వడబలిజ, విశాఖ సౌత్)

బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ మాదిగ, అమలాపురం)

జయమంగళ వెంకటరమణ (బీసీ వడ్డీ, కైకలూరు)

చంద్రగిరి ఏసురత్నం (బీసీ వడ్డెర, గుంటూరు వెస్ట్)

మర్రి రాజశేఖర్ (ఓసీ కమ్మ, చిలకలూరిపేట)

గవర్నర్ కోటా అభ్యర్థులు

కుంభా రవిబాబు (ఎస్టీ ఎరుకుల, అరకు)

కర్రి పద్మశ్రీ (బీసీ వాడబలిజ (మత్సకార), కాకినాడ సిటీ)

ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాసన మండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, కొద్ది రోజుల్లో జరుగనున్న ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎన్నికకు సంబంధించి సీనియర్‌ లీడర్లతో చర్చించి పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ పేర్లు పైనలైజ్‌ చేశారు. మాములుగా అయితే ఈ రోజు 9 పేర్లు మాత్రమే ప్రకటించాలి. మిగిలిన వాటికి సమయం ఉంది. గ్రాడ్యుయేట్స్, టీచర్ల ఎన్నికలు జరుగుతున్నాయి. సహాజంగానే వైస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ ఉంది. పోటీకి పెద్దగా ఆస్కారం లేనికారణంగా స్థానాల్లో ఎన్నిక లాంఛానప్రాయం అయ్యిందన్నారు.