నాని ‘దసరా’ మూవీ రిలీజ్ డేట్..

నేచురల్ స్టార్ నాని దసరా మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మధ్యనే అంటే సుందరానికి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. దసరా మూవీ తో రాబోతున్నాడు. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఈ ఈది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ..ఇప్పుడు మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే.

అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తుండగా , సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.