సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని

Nandamuri Suhasini meet CM Revanth Reddy

హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టిడిపి తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.