పోలీసుల అనుమతి రాకపోవడం తో అయోమయంలో జనసేన కార్యకర్తలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గాంధీ జయంతి సందర్భాంగా తూర్పు గోదావరితో పాటు అనంతపురం జిల్లాలో శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపై శ్రమదానం చేసి.. బహిరంగ సభ ఏర్పటు చేయాలనీ అనుకున్నారు. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్‌ బాలాజీపేట సెంటర్‌కు బహిరంగ సభను మార్చారు. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్‌ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. అయితే వేదికను మార్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇంకా రాకపోయేసరికి జనసేన కార్య కర్తలు టెన్షన్ లో ఉన్నారు.

ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పోరాడుతోంది. ప్రభుత్వం తాము విధించిన గడువులోగా స్పందించకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పవన్ గతంలోనే చెప్పారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల మరమ్మతుకు శ్రీకారం చుట్టారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మరమ్మతులు చేయాలనీ అనుకున్నారో..అక్కడ ప్రభుత్వం పవన్ రాక కంటే ముందే మరమ్మతులు చేసింది. దీనిని జనసేన ట్విట్టర్ లో పోస్ట్ చేసి జనసేనాని ఎఫెక్ట్ రాత్రికి రాత్రే తయారు రోడ్డు..ఆశ్చర్యంలో స్థానికులు అంటూ పోస్ట్ చేసారు.

” జనసేనాని ఎఫెక్ట్ ” రాత్రికి రాత్రి తారు రోడ్డు, ఆశ్చర్యంలో స్థానికులు | Anantapur

#JSPForAP_Roads pic.twitter.com/xLJR72Fg8z— JanaSena Party (@JanaSenaParty) October 1, 2021