కింగ్ నాగార్జున కు నోటీసులు

కింగ్ నాగార్జున కు గోవా గ్రామపంచాయితీ నోటీసులు జారీ చేసింది. చిత్రసీమలోని అగ్ర హీరోలలో నాగార్జున ఒకరు. అన్నపూర్ణ స్టూడియో అధినేతగా.. బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలు నిర్మించడమే కాదు..బుల్లితెర సీరియల్స్ కు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాదులో రంగారెడ్డి జిల్లా పరిధిలో కొన్ని వందల ఎకరాలు భూమి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున గోవాలోని గ్రామపంచాయతీ రాజ్ నుంచి లీగల్ నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

గోవాలోని మాండ్రేమ్ అనే గ్రామంలో ఓ అందమైన ఇంటిని నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఆ ఇంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. నాగార్జున ఇంటి నిర్మాణం అక్రమంగా జరుగుతోందని.. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులు పంపినట్లు సమాచారం. మాండ్రేమ్ గ్రామంలో నాగార్జున ఇంటికి సంబంధించి నిర్మాణ పనును ఆపాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులో పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికైతే కింగ్ నాగ్.. ఇంకా ఈ నోటీసులపై స్పందించలేదు.

అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నాగ్ కి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరి నాగ్ కి నోటీసులు జారీచేసింది ఎవరు? అనంటే.. విషయం తెలుగు రాష్ట్రాలలో కాదు. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు.