ఇస్మార్ట్ శంకర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..?

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ హీరో రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడా..? అదికుడా ప్రేమ వివాహమా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో , సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. వై.వి.యస్.చౌదరి తెరకెక్కించిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మొదటి నుండి క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్..పూరి డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ ద్వారా తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీసి అభిమానులకు , సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటె రామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. తన చిన్ననాటి క్లాస్‌మేట్‌తో లవ్‌లో ఉన్నాడని, కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న వీళ్లిద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని పెళ్లి మాత్రం నవంబర్ నెల కార్తీకమాసంలో జరగనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే వీరిద్దరి పేర్లతో ముహూర్తం కూడా నిర్ణయం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల ఫై రామ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.