నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు..కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

నాగాలాండ్‌లో నామినేషన్‌ ఉపసంహరించుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

congress

కోహిమాః కాంగ్రెస్‌ పార్టీ మరోసారి నాగాలాండ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన ఆ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారంతో గడువు మగిసింది. అయితే ఆఖరి క్షణాల్లో తను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

దీంతో బిజెపి అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. నాగాలాండ్‌ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్నది.