వాల్తేర్ వీరయ్య పబ్లిక్ టాక్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య థియేటర్స్ లోకి రావడమే కాదు పూనకాలు తెప్పిస్తుంది. మెగా అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో..సినిమా ఎలా ఉండాలనుకున్నారో అదే తీరులో సినిమా ఉంది. మాస్ డైలాగ్స్ , దుమ్ములేపే డాన్స్ , ఈలలు వేయించే చిరు లుక్ , థియేటర్స్ దద్దరిల్లిపోయేలా దేవి శ్రీ మ్యూజిక్ ..అన్నిటికి మించి బాబీ డైరెక్షన్ ఎలా అన్ని కూడిన ఫుల్ మాస్ బిర్యానీ వాల్తేర్ వీరయ్య అంటున్నారు.

గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా ఈరోజు సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటించగా, రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాలో చిరంజీవి యాక్టింగ్ కేక అని , శృతి హాసన్ గ్లామర్ అదిరిపోయిందని , రవితేజ- చిరంజీవి ల మధ్య సన్నివేశాలు హైలైట్స్ గా ఉన్నాయని , ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని అంటున్నారు. కాకపోతే రొటీన్ కథ – కథనం, కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం కాస్త నిరాశ కలిపించిందని అంటున్నారు. ఓవరాల్ గా చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగ లాంటి సినిమా. సంక్రాంతి పండగ సీజన్‌లో మంచి జోష్ నింపే చిత్రంగా వాల్తేరు వీరయ్య తెరకెక్కింది.