విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. స్కూల్ కు ఫూల్ గా మద్యం తాగి వచ్చాడు

టీచర్ అంటే ఎలా ఉండాలి..పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో ఎలా ఉండాలో..ఎలా ఉండకూడదో .ఏది మంచో..ఏది చెడో చెపుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తాను ఉన్నత స్థాయి లో ఉన్న అని మరచి స్కూల్ కు ఫూల్ గా మద్యం తాగి వచ్చాడు. కనీసం నిలబడలేని స్థితిలో వచ్చి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ..

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పారవలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ..ఫుల్ గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం తాగి వచ్చిన ప్రధానోపాధ్యాయుడు తిరుపతి.. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నాడు. మత్తులో ఊగుతూ.. నేలపైనే కూర్చుండిపోయాడు. ప్రధానోపాధ్యాయుడు తాగి వచ్చిన విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు చెప్పాల్సిన మాస్టారు.. ఇలా ఉంటే పిల్లలను బడికి ఎలా పంపిస్తామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆ స్కూల్ లో మొత్తం 52 మంది పిల్లలు ఉండగా..ప్రధానోపాధ్యాయుడు తో పాటు మరో టీచర్ పనిచేస్తున్నారు. అయితే ఈరోజు ఆ టీచర్ సెలవు పెట్టి స్కూల్ కు రాలేదు. దీంతో తిరుపతి ఫుల్ గా మద్యం సేవించి వచ్చాడు.