తమ్మారెడ్డి ఫై విరుచుకుపడుతున్న సినీ ప్రముఖులు

ఆర్ఆర్ఆర్ మూవీ ఫై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ఫై యావత్ సినీ ప్రేక్షకులు , అభిమానులే కాదు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఖర్చులు రూ.80 కోట్లు అని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తమ్మారెడ్డి అన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యల ఫై సీనియర్ డైరెక్టర్ , దర్శకేంద్రుడు రాఘవేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలని రాఘవేంద్రరావు హితవు పలికారు. అంతేకానీ, 80 కోట్లు ఖర్చు అనడం సరికాదని, అయినా రూ.80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర ఏదైనా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉందా? అంటూ తమ్మారెడ్డిని నిలదీశారు. ఒకవేళ జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అని రాఘవేంద్రరావు ప్రశ్నించారు.

అలాగే మెగాబ్రదర్ నాగబాబు సైతం ఘాటుగా స్పందించారు. “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అంటూ ఫైర్ అయ్యారు. ఇక అభిమానులైతే ఓ రేంజ్ లో తమ్మారెడ్డి ఫై ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు.