దసరా బరిలో నాగచైతన్య ‘తండేల్’..?

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘తండేల్’. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో సాయి పల్లవి – చైతు కలయికలో లవ్ స్టోరీ మూవీ వచ్చి ఆకట్టుకోగా..ఇప్పుడు మరోసారో వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో ఈ మూవీ కూడా భారీ విజయం సాదిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ దసరాకు ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి రెండు బ‌డా సినిమాలు బుక్ అయ్యాయి. ప‌వన్ కళ్యాణ్ హీరోగా వ‌స్తున్న ఓజీ చిత్రం సెప్టెంబ‌ర్ 27 తేదీని బుక్ చేసుకోగా.. 13 రోజుల గ్యాప్‌లోనే ఎన్టీఆర్ దేవర (అక్టోబ‌ర్ 10)న విడుద‌ల తేదీని అనౌన్స్ చేసింది. దీంతో తండేల్‌ను ఈ సినిమాల మ‌ధ్య‌లో తీసుకోస్తే.. నాగ చైత‌న్య‌కే ప్ర‌మాద‌మ‌ని సినీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. మరి తండేల్ ను వెనక్కు జరుపుతారా..? లేదా పోటీగా దింపుతారా అనేది చూడాలి.