విడాకుల ప్రకటన తర్వాత చైతు ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ

నాగ చైతన్య – సమంతలు తాము విడాకులు తీసుకుంటున్నట్లు శనివారం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రాగానే అంత షాక్ లో పడ్డారు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ వార్త అబద్దమైతే బాగుండని అనుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియా లో , మీడియా చానెల్స్ లలో ఈ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో నాగ చైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలపై రియాక్ట్ అయ్యారు నాగ చైతన్య. తన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ గురించి విషయాలు మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఎక్కడా కూడా పర్సనల్‌ లైఫ్‌ గురించిన డిస్కస్‌ నడవలేదు. కేవలం లవ్ స్టోరీ జర్నీపై మాట్లాడుతూ ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. రేవంత్‌ అనే పాత్రలో లీనమై తెలంగాణ యాసలో మాట్లాడటం చాలా టఫ్ జాబ్ అని చెప్పిన చైతూ.. ఈ రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించిందని అన్నారు. తాను, సాయిపల్లవి రేవంత్‌, మౌనిక పాత్రల్లోనే ఉండిపోయామని, రియల్‌ లైఫ్‌ పాత్రలను పూర్తిగా మర్చిపోయామని అన్నారు.

YouTube video