జాలరిగా ‘నాగ చైతన్య’..

Nagachaitanya Interview Photos

అక్కినేని నాగ చైతన్య త్వరలో జాలరిగా కనిపించబోతున్నారు. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న చైతు..రీసెంట్ గా కస్టడీ మూవీ తో వచ్చి మరో ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్లో . గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య.. జాలరిగా కనిపించనున్నారని తెలుస్తుంది.

‘మత్స్యకారుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. చేపలను వేటాడటానికి వాడే పడవకు డ్రైవర్‌గా చైతన్య కనిపిస్తారు. గుజరాత్‌లో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. అక్కడ చాలా లోతుగా పరిశోధన చేసి కథ సిద్ధం చేశాం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఇక చందు మొండేటి ‘కార్తికేయ 2’ సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన సినిమా అంటే కచ్చితంగా ట్విస్టులు, టర్న్‌లు చాలా ఉంటాయి. కథపై ఆయన రీసెర్చ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి, నాగచైతన్యతో చందు మొండేటి సినిమా అంటే మినిమం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు.