తెలంగాణలో క్షయను నిర్మూలించడమే మా లక్ష్యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్షయ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ స్పందించారు. 2025 నాటికల్లా దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంటే.. తెలంగాణలో ఈ కేసులు పెరుగుతునాన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం ట్వీట్ చేశారు. క్షయ వ్యాధి నియంత్రణ అధికారుల బృందంతో సమావేశం కానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు తాను పూర్తి చిత్తశుద్ధితో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమిళిసై తెలిపారు. క్షయ వ్యాధిపై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ తమిళిసై ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/