50 ఏళ్ల తర్వాత మయన్మార్ లో నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష

హింస, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ అభియోగాలు

death-sentence
death-sentence

యాంగోన్‌ః మయన్మార్‌ సైనిక ప్రభుత్వం 50 ఏళ్ల తర్వాత దేశంలో ఉరిశిక్ష అమలు చేసింది. తాజాగా ఓ రాజకీయ నేత సహా నలుగురికి మరణశిక్ష అమలు చేసింది. ఆంగ్ సూన్ సూకీ వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు పోయో జియో థావ్ తో పాటు మరో ముగ్గురు ప్రజాస్వామ్య ఉద్యమకారులను కూడా సైన్యం ఉరికొయ్యకు వేలాడదీసింది. వీరు హింసాత్మక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి పాల్పడినట్టు మయన్మార్ మిలిటరీ పాలకులు ఆరోపించారు. గత జూన్ లో జియో థావ్ తో పాటు హలా మియా, ఆంగ్ తురా జా, కో జిమ్మి అనే ప్రజాస్వామ్య ఉద్యమకారులకు సైన్యం మరణశిక్ష ఖరారు చేసింది. . ఆంగ్​ సాన్ సూకీ పార్టీలో పోయో థావ్ కీలక నేతగా ఉండేవారు. ఈ నలుగురికి జూన్‌లోనే మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ మ‌య‌న్మార్ ఆర్మీ ప్ర‌క‌ట‌న చేసింది. దానిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అప్పట్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

కాగా, గతేడాది ఆంగ్‌ సాన్‌ సూకీ నుండి అధికారాన్ని సైన్యం బలవంతగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ గత ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించున్ను సైనం ఆమె పై పలు కేసులు బనాయించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/