నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ఇళయరాజా
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన ఇళయరాజా

న్యూఢిల్లీః ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా నేడు రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకల సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆయన చేత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఇటీవలే ఇళయరాజా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఇళయరాజాతో పాటు తెలుగు సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన సామాజికవేత్త వీరేంద్ర హోగ్డే , కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉషలను ఇటీవలే కేంద్రం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉషలు ప్రమాణం చేయగా.. సోమవారం ఇళయరాజా ప్రమాణం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/