మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు : ఏడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 2555 ఓట్ల ఆధిక్యం

munugode counting

Live Updates :

ఏడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 2555 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7189, బీజేపీకి 6803 ఓట్లు వచ్చాయి.

  • మొత్తం ఆరు రౌండ్లు ముగిసేసరికి 2,162 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్
  • ఎన్నికల కౌటింగ్ ఆలస్యం ఫై బిజెపి , టిఆర్ఎస్ నేతల ఆగ్రహం
  • ప్రతి రౌండ్ పూర్తి కాగానే మీడియా కు వెంటనే తెలపాలి
  • మొత్తం ఐదు రౌండ్లు ముగిసేసరికి 1631 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్
  • నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26343 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25730, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 8200, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్‌కు 907 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ 613 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది.
  • నాల్గు రౌండ్లు పూర్తైసరికి టిఆర్ఎస్ 613 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

నాల్గో రౌండ్ లోను బిజెపి ఆధిక్యం

  • నాల్గో రౌండ్ బిజెపి 2 వేల ఆధిక్యంలో ఉంది
  • మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యం కనిపించగా..ఆ తర్వాత 2 , 3 , 4 రౌండ్ లలో బిజెపి ఆధిక్యం చూపించింది. ఇప్పటి వరకు కోమటి రెడ్డి రాజగోపాల్ ఆధిక్యం లో ఉన్నారు. నాల్గు రౌండ్లు ముగిసేసరికి బిజెపి ఆధిక్యం లో ఉంది.
  • మొదటి రౌండ్‌లో టిఆర్ఎస్ స్పీడ్ చూపించిన.. రెండు, మూడు రౌండ్లలో మాత్రం బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
  • రెండో రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యం లో నిలిచింది.
  • రెండో రౌండ్‌లో 789 ఓట్లతో బిజెపి ఆధిక్యం

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం..

  • మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌‌లో కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. చౌటుప్పల్‌లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1192 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 6096, బీజేపీ 4904, కాంగ్రెస్ 1877 మొత్తం- లీడ్ 1192 ఓట్లు.
  • పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ 4 ఓట్లతో ఆధిక్యం.
  • పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ 228 , బీజేపీ 224 , ఇతరులు 88

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక​ కౌటింగ్ మొదలైంది. మొత్తం 47 మంది బరిలో నిలువగా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నడుమ పోటీ నడిచింది. పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పోస్టల్‌ బ్యాలెట్ లెక్కింపు పూర్తి కాగా టిఆర్ఎస్ 4 ఓట్ల ఆధిక్యం కనపరిచింది.

కౌంటింగ్ ప్రారంభానికి ముందే ఆయా పార్టీల అభ్యర్థులు నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుర్చీపై కూర్చొని ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల షేక్ హ్యాండ్ ఇచ్చారు. వారిద్దరూ కరచాలనం చేసుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోలింగ్​(పోస్టల్​బ్యాలెట్​ ఓట్లు కలుపుకొని) 93.41 శాతం నమోదైంది. నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్​ సీఐ గోదాంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన తర్వాత, వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులు ర్యాండమ్​గా ఐదు తప్పనిసరిగా చెక్​ చేస్తారు.

ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో వంద మంది ఓట్ల లెక్కింపు చేపడుతారు. మరో 150 మందిని ఇతర కార్యక్రమాల కోసం నియమించారు. కౌంటింగ్​ కేంద్రం వద్ద 144 సెక్షన్​ విధించారు. లెక్కింపు టైంలో మూడం చెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్​రాజ్​ తెలిపారు.