ఏపీలో ప్రారంభమైన కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్

సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్

నెల్లూరు: ఏపీలో ఆగిపోయిన మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు, కుప్పం మునిసిపాలిటీలో 24 వార్డులు, జగ్గయ్యపేట మునిసిపాలిటిలో 31 వార్డులు, కొండపల్లి మునిసిపాలిటీలో 29, పెనుకొండలో 20, రాజంపేటలో 29, కమలాపురం నగర పంచాయతీలో 20, ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, బుధవారం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/