జైలులోనే చంపాలనుకున్నారు..తీన్మార్ మల్లన్న

గాంధీ జయంతి రోజున చంపేందుకు ప్లాన్
విఫలం కావడంతో ఆ తర్వాతి రోజు చీకటి గదిలో బంధించారు
బలవంతంగా మందులు ఎక్కించి పిచ్చోడిని చేయాలనుకున్నారు

హైదరాబాద్ : పలు అభియోగాలతో ఇటీవల అరెస్ట్ అయిన క్యూ న్యూస్ యూ ట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులోనే తనను అంతమొందించాలని ప్రయత్నించారని ఆరోపించారు. ‘తీన్మార్ మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ’ పేరుతో నిన్న ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున పాత నేరస్థుల సహకారంతో తనను చంపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే, వారి ప్రయత్నం విఫలం కావడంతో తర్వాతి రోజు జైలులో తనను ఓ చీకటి గదిలో బంధించారని అన్నారు. మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఔషధాలను బలవంతంగా తనకు ఎక్కించి పిచ్చివాడిని చేయాలనుకున్నారని మల్లన్న ఆరోపించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/