ఎల్బీ స్టేడియంలో దొంగతనం..

దొంగలు రూట్ మార్చారు..ఇళ్లలో , షాప్స్ లలో దొంగతనాలు చేసే వీరు..ఇప్పుడు స్టేడియాల మీద పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి ఎల్‌బీ స్టేడియంలో దొంగతనం చేసి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి ఎల్‌బీ స్టేడియంలో చోరీకి ప్లాన్ చేసిన దొంగలు.. ఫుట్‌బాల్స్ ను ఎత్తుకెళ్లారు. అసోసియేషన్ కార్యాలయంలో వాటిని చోరీ చేసేశారు. రోజు రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది.. గదిలో చిందరవందరగా ఉండటంతో వెంటనే సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్యాలయంలో ట్రోఫీలు, ప్లేయర్స్‌కి అందించే కిట్లు ఎత్తుకెళ్లారు. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. వాటి విలువ కాస్త ఎక్కువేనండీ. రూ.50 వేల విలువ చేసే ట్రోఫీలు, రూ.10 వేల విలువ చేసే ప్లేయర్స్ కిట్లు దుండగులు అపహరించినట్లు పాల్గుణ పేర్కొన్నారు. సైఫాబాద్ పోలీసులు ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.