ముక్తినొనగే ముక్కోటి ఏకాదశి

నేడు ముక్కోటి పర్వదినం

Uttaradwara darshanam
Uttaradwara darshanam

శ్రీవైష్ణవ సంప్రదా యంలో వైకుంఠ ఏకాదశికి మించిన పండుగ లేదంటేఅతిశయోక్తి కాదు. ప్రతి సంవత్సరం మార్గ శిర శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే వచ్చే మొట్ట మొదటి ఏకాదశే వైకుంఠ ఏకాదశి. సంవత్సరంలో రెండు అయనాలుంటాయి. మొదటిది ఉత్తరాయణం,రెండవది దక్షిణాయనం.
దక్షిణాయనంలో ఆషాఢశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అని అంటారు) రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో యోగనిద్రలోకి వెడతాడు. అనగా శయనిస్తాడన్నమాట! ఇలా నాల్గు నెలలు శయనించిన తర్వాత కార్తీకశుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున యోగ నిద్ర నుండి నిదురలేస్తాడు. మార్గశిర శుద్ధ ఏకాదశి (మోక్ష ఏకాదశి) రోజున అశేష జనావళికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు.
సూర్యుడు దక్షిణాయనంలో దక్షిణ పక్కగా నడవటం వల్ల సూర్యరశ్మి తగ్గి చురుకుదనం లేక శీతగాలులు వీస్తుంటాయి. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరదిక్కుగా తన పయనం సాగిస్తాడు. సూర్యరశ్మి చురుకుదనంగా ఉండి మానవాళికి ఆరోగ్యాన్ని కలుగచేస్తాడు.
కనుక కాలస్వరూపంలో ఉత్తరం పగలయితే రాత్రి దక్షిణం అవు తుంది. ఉత్తర దక్షిణాల్లో ఉత్తరం వైపుకు నడవటం శుభప్రదమైంది, మంగళప్రదమైందని పురాణవచనం. ఈ క్షణం నుండి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది!
అందచేత బ్రహ్మదేవ్ఞడు ముక్కోటి దేవతలతో కలసి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోనికి ప్రవేశించి శ్రీమన్నారా యణుని సందర్శించి తరిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అని, యోగనిద్ర నుండి లేచిన శ్రీమన్నారాయణుని వైకుంఠంలో దర్శించినందున ‘వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున తనువ్ఞచాలించి జీవ్ఞనికి మోక్షాని ప్రసాదిస్తాడుకనుక మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలను కూడా ఉత్తరాయణం పగలనీ, దక్షిణాయనం రాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక ‘ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణం ఇలా తెలియజేసింది.

ఏకాదశి ప్రాముఖ్యత:

.శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశి వ్రతం తాపసులకు ముఖ్యమైన తపస్సు. పైగా దేవతలకు దుర్లభం. దేవగణాల్లో శ్రీకృష్ణునివలె, దేవీగణాల్లో మూలప్రకృతి వలె, వర్ణాల్లో బ్రాహ్మణునివలె, విష్ణుభక్తుల్లో శివునివలె, పూజనీయ మహనీయుల్లో విఘ్నేశ్వరునివలె, విద్యావంతుల్లో సరస్వతివలె, శాస్త్రాల్లో వేదాలవలె, పుణ్య తీర్థాల్లో గంగానది వలె, తేజస్సుతో ప్రకాశించే ద్రవ్యాల్లో బంగారం వలె, జీవుల్లో శ్రీవైష్ణవ్ఞలవలె, ధనంతో విద్యవలె, సంగమం కలవారిలో భార్యవలె, ప్రమధుల్లో రుద్రునివలె, ఇంద్రియాల్లో ఆత్మవలె, పూజించదగిన స్త్రీల్లో తల్లివలె, తేజోవంతుల్లో సూర్యునివలె, సహనంలో భూదేవివలె, వేదాల్లో సామవేదంవలె, పుష్పాల్లో తులసీదళంవలె, రుద్రుల్లో శివునివలె, మంత్రాల్లో గాయత్రీ మంత్రంవలె, భూభాగం లో భారతవర్షంవలె, బ్రహ్మర్షు ల్లో భృగువలె, నృపుల్లో శ్రీరామునివలె, జ్ఞానయోగుల్లో సనత్కుమారునివలె, గజేంద్రాల్లో ఐరావతంవలె, మృగాల్లో శరభం వలె, మణుల్లో కౌస్తుభం వలె, శైలాల్లో హిమవంతునివలె, నదుల్లో సరస్వతీనదివలె, గంధ ర్వుల్లో చిత్రరధునివలె, యక్షుల్లో కుబేరునివలె, రాక్షసుల్లో సుమాలివలె, మనువ్ఞల్లో స్వాయంభువ మనువలె, ఈ ఏకాదశీ వ్రతం మిక్కిలి ఉత్తమమైంది. శ్రేష్టమైంది.

ఏకాదశి.. అంటే..

పూర్వము కుంభరాక్షసుని కుమారుడైన మృదమన్యుడు తపస్సుచే శివుని మెప్పించి అమోఘములైన వరాలను పొందాడు. ఆ వరప్రభావంతో అన్ని లోకాల్ని బాధించు చుండెను. అతనికి భయపడి దేవతలు అమలకవృక్షం తొర్రలో దాగిరి. వారి వెంటబడి వచ్చిన ఆ దానవుని ఆ వృక్షకోటరము నుండి జనించిన అయో నిజమైన స్త్రీ సంహరిం చింది. ఆమెయే ఏకాదశి. ఆమెకు కృతజ్ఞతారూపంగా ప్రతి పక్షంలో 11వ రోజు ఉపవసించుట సంప్రదాయమైంది.

అంతేగాక దీన్ని గురించి భవిష్యోత్తర పురాణంలో ఏకాదశి కథ ఇలా చెప్పబడింది. కృతయుగంలో తాళజం ఘుడను రాక్షసుని కుమారుడైన ‘మురదానవుడు దేవతల్ని నానా బాధలకు గురి చేయుచుండెను. వారు విష్ణువుని సమీపించి ‘మురదానవ్ఞని సంహరింపుమని ప్రార్థించారు. విష్ణుసంకల్పం వల్ల అతని దేహము నుండి జన్మించిన మహాబలం కలిగిన కన్య ఆ దానవుని సంహరించింది. ఆమె పక్షం (15 రోజులు)లో 11వ రోజు జన్మించుటచే ‘ఏకాదశి అయ్యింది.

ఆమె చేసిన పనికి సంతసించి ఆమెను వరమడుగుమని విష్ణువు అన్నాడు. ‘ఈ నా దినమున భక్తులు మిమ్ము పూజించాలి. నా తిధికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యం, పవిత్రత ఏర్పడునట్లుగా అనుగ్రహింపుము అని వారిని ప్రార్ధించింది.

నాటి నుండి ఏకాదశి వ్రతమారంభమైంది. ఏకాదశిలో అంతర్లీనంగా నున్న భాష్యం ఏమిటంటే ఏకాదశ అంటే పక్షంలో 11వ రోజు.ఆ పదకొండు ఏమిటంటే 5 కర్మేంద్రియాలు ( పాణి, పాదము, గుదము, వాక్కు, ఉపష్థు) 5 జ్ఞానేంద్రియాలు (చెవి, చర్మము, నోరు, కన్ను, ముక్కు) తర్వాత మనస్సుతో కలిపి పదకొండు. ఈ ఏకాదశాంశాల ఏకత్వమే పరిపూర్ణస్థితి.

ముక్కోటి ఏకాదశి అంటే ..

రావణాసురుని బాధలు తట్టుకోలేక దేవతలు బ్రహ్మను వెంటపెట్టుకుని వైకుంఠం చేరి మార్గశిర శుద్ధ ఏకాదశినాడు మహావిష్ణువును ప్రార్ధిం చారు. ఆ మహావిష్ణువ్ఞ బ్రహ్మదులకు దర్శనమిచ్చి అభయమిచ్చాడు. అందువల్ల సకలబాధలను పోగొట్టినట్టి ఈ ఏకాదశి మార్గం చూపించిందని విజ్ఞులు భావిస్తారు. మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం.

ఇది సాధారణంగా మార్గశిర,పుష్యమాసాలోనే వస్తుంది. కాని ఈ సంవత్సరం పూర్తిగా మార్గశిర మాసంలోనే ధను ర్మాసం ఆవరించింది. మధుకైటభులను శ్రీహరి సంహరించినపుడు వారు దివ్యరూ నపాలు ధరించి దివ్యజ్ఞానాన్ని పొంది శ్రీహరితో ఇలా అంటున్నారు.

‘దేవా! వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశ పూజను చేసి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి వైకుంఠప్రాప్తి కలిగించమని ప్రార్థిం చారు. స్వామి అందుకు అంగీకరించి అనుగ్రహించాడు.

ఈ విధంగా ముక్కోటి ఏకాదశి అయింది. ఈ ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసం నాడు
‘ఉపవాసః సవిజ్ఞేయః సర్వభోగవివర్జితః పాపకృత్యాలకు దూరంగా ఉండి సకలభోగాలను వదలి పుణ్యకార్యాలను చేయడమే ఉపవాసవిధి అని పండితులు చెబుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/