వేరుసెనగ బొబ్బట్లు

రుచి: వెరైటీ వంటకాలు

కావలసినవి : మైదాపిండి: కప్పు, నెయ్యి: సరిపడా, వేరుసెనగపప్పు : కప్పు. నువ్వులు :
3 టీస్పూన్లు, బెల్లం తురుము : ముప్పావుకప్పు,
యాలకులు : రెండు

తయారు చేసే విధానం : పాన్‌లో వేరుసెనగపప్పువేసి వేయించి పక్కన ఉంచాలి. తరవాత నువ్వులు కూడా వేయించి తీయాలి. ఇప్పుడు వేరుసెనగపప్పు, నువ్వులు, యాలకులు మక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత ఈ మిశ్రమంలో బెల్లంపొడి వేసి కలిపి పక్కన ఉంచాలి. మైదాలో నెయ్యివేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి పిండిలా కలపాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా చేసుకుని పూరీలా వత్తాలి. అందులో సుమారు టేబుల్‌స్పూను పల్లీల మిశ్రమం వేసి అంచులు మూసేసి మళ్లీ నెయ్యి అద్దుతూ పూరీలా వత్తాలి. ఇలాగే అన్నీ చేసిపెనంమీద నెయ్యివేస్తూ రండు వైపులా కాల్చి తీయాలి.

క్యారెట్‌-కొబ్బరి పూర్ణాలు

కావలసినవి : మైదాపిండికప్పు, బియ్యపిండి: కప్పు, క్యారెట్‌ తురుము: కప్పు, నెయ్యి: 2 టీస్పూన్లు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు యాలకులపొడి: టీస్పూను పంచదార : అరకప్పు, వంటసొడా: చిడికెడు, ఉప్పు: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం : గిన్నెలో మైదాపిండి, బియ్యప్పిండి, వంటసోడా, ఉప్పు, నీళ్లుపోసి పలుచగాదోసెల పిండిలా కలపాలి. పాన్‌లో నెయ్యి వేసి క్యారెట్‌ తురుము వేసి వేగనివ్వాలి. పచ్చికొబ్బరిని కూడా వేసి వేగాక అందులోనే పంచదార.

యాలకులపొడి వేసి వేయించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. తరవాత చిన్న ఉండల్లా చేసి పక్కన ఉంచుకుని మైదాపిండి మిశ్రమంలో ముంచి పూర్ణాల్లా వేయించి తీయాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/