సర్వస్వ శరణాగతి

ఆధ్యాత్మిక చింతన

Issue between Vali and Sugreev
Issue between Vali and Sugreev

ముఖ్యాంశాలు:

  • శరణాగతి అంటే భగవంతుని శరణువేడటం అని
  • ఎందుకిలా అని ఆలోచిస్తే ఇక్కడో మర్మం కనబడుతుంది.
  • నిజానికి భగవానుడు సర్వాంతర్యామి.

చాలా మంది మేము భగవంతుని పూర్తిగా నమ్మాం. అయినా దేవుడు మా మొర ఆలకించలేదు అంటూ ఉంటారు.

అయితే భగవంతుని ఏదైనా కోరడానికి సర్వస్వ శరణాగతి ఎంత తేడా ఉందో తెలిపే ఉదాహరణ మనకు రామాయణంలో ఒకటి కనపడుతుంది.

సీతమ్మ వారిని వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు హనుమ సుగ్రీవ్ఞలు తారసపడటం వారి మైత్రి తర్వాత వాలి వధ గురించి చర్చకు వస్తుంది.

ఈ సందర్భంలో సుగ్రీవుడికి రాముని శకిత మీద నమ్మకంలేక రెండు పరీక్షలు పెడతాడు.

ఒకటి వాలి వధించిన దుందుభి కళేబరాన్ని కొంతదూరం అవతల పడేలా తన్నమడనం, రాముడు ఇది చేసినా పూర్తిగా సుగ్రీవుడు వాలి రోజు కదిల్చే 7 సాల వృక్షాలలో కనీసం ఒకదానినైన కొట్టమనం అంటాడు.

ఆరముడు ఒకే బాణంతో ఏడు సాల వృక్షాలను కూల్చితే అపుడు సుగ్రీవ్ఞడు వెళ్లి వాలిని యుద్ధానికి పిలుస్తాడు.

అయితే మొదటిసారి సుగ్రీవుడు యుద్ధంలో ఓడి వచ్చి తనను రక్షించలేదని రాముడిని అడిగితే ఇద్దరిలో తేడా గుర్తించలేకపోయినందువల్ల వాలిని సంహరించలేదని చెబుతాడు రాముడు.

రెండోసారి సుగ్రీవుడు మెళ్లో దండవేసి పంపిన తర్వాత ఊడా వాలి సుగ్రీవుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది.

చివరకు సుగ్రీవుడు తన శక్తి కోల్పోయి ప్రాణలు పోతున్నాయనే స్థితిలో రామునికోసం వెదికిన తర్వాతే రాముడు వాలిని సంహరిస్తాడు.

ఎందుకిలా అని ఆలోచిస్తే ఇక్కడో మర్మం కనబడుతుంది. నిజానికి భగవానుడు సర్వాంతర్యామి. సకల చరా చర సృష్టికర్త అయిన భగవంతుడు. వాలిని గుర్తించ లేకపోవడం అన్నది నిజం కాదు.

దీనికి మొదటి కారణం రాముడు రామావతారంలో మానవ్ఞడిగానే ప్రవర్తిస్తాడు. కనుక ఒక మానవుడిగానే ప్రవర్తిస్తాడు.

కనుక ఒక మానవుడు ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు కొత్త వ్యక్తులను ఎలా గుర్తించలేడో అదే అక్కడ జరిగనట్లు మనం అర్ధం చేసుకోవాలి.

ఇక అసలు కారణం. సుగ్రీవుడు భగవంతుడిని పూర్తిగా నమ్మలేదు. దానికి రుజువుసుగ్రీవుడు రాముడికి పెట్టిన పరీక్షలు.

అలాగే మొదటిసారి వాలి చేతిలో దెబ్బలు తిన్న సుగ్రీవుడు ఆరముడు తనను రక్షిస్తాడని కూడా చూడకుండా దెబ్బలు తాళలేని స్థితికి చేరగానే యుద్ధభూమిని వదిలి వచ్చేశాడు.

ఇది కూడా అతడు భగవంతుడిని పూర్తిగా నమ్మలేదనటానికి నిదర్శనం. ఇక రెండవ సారి సుగ్రీవ్ఞడి మెడలో దండ ఉంది. కనుక వాలిని తేలికగా వధించవచ్చు.

అయితే సుగ్రీవ్ఞడు తన సహాయం అర్థించే వరకు రాముడు వేచి చూడటం వెనుక అర్ధం.

భక్తుడు భగవంతుని సర్వస్వ శరణాగతి చేయాలి అని. రెండవసారి తనకు దెబ్బలు తగులుతున్నా లెక్కచేయక భగవంతుడు (రాముడు ) వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకం సుగ్రీవ్ఞనికి ఉండటం వలన అతను యుద్ధభూమిలోనే రాముని ప్రార్థిస్తూ ఉండిపోయాడు.

ఎప్పుడయితే తన భక్తుడు తననే నమ్ముకుని ఉన్నాడని భగవంతునికి కుదురుతుందో అప్పుడే ఆయన తన భక్తులను కాపాడటానికి వస్తాడు.

అదే ఇక్కడా జరిగి వాలి వధ జరిగింది. అనేక మంది భక్తుల చరిత్రలు పరిశీలించినపుడు కూడా వారు సర్వస్వ శరణాగతి చేసినపుడు భగవంతుడు వారిని కరుణించడం మనకు అర్ధమవుతున్నది.

గజేంద్రమోక్షంలో ఏనుగుని రక్షించినపుడు రామదాసుని తానీషా చెర నుండి విడిపించేటపుడు భగవంతుడు వారిని కరుణించడం అనే దానికి కారణం ఈ సర్వస్వ శరణాగతే.

  • వులాపు బాలకేశవులు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/