ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానంలో ముఖేష్‌ అంబానీ

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో 5వ స్థానానికి చేరిన అంబానీ

Mukesh Ambani
Mukesh Ambani

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్‌లను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. బర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు ముఖేష్ అంబానీ. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. మార్క్ జుకర్ బర్గ్ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉన్నారు.

ఇక అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 183.7 బిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, రెండో స్థానంలో మైక్రో సాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మూడో స్థానంలో లగ్జరీ గూడ్స్ బ్రాండ్ అయిన  LVMH మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది. నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఐదో స్థానంలో ముఖేష్ అంబానీ, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, తొమ్మిదో స్థానంలో టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, పదో స్థానంలో గూగుల్ కోఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/