విదేశీ టూరిస్టుపై సామూహిక అత్యాచారం

spanish-woman-gangraped-in-jharkhand-dumka

దుమ్‌కా: జార్ఖండ్‌లోని దుమ్‌కా జిల్లాలో స్పెయిన్‌కు చెందిన టూరిస్టు పై సామూహిక అత్యాచారం జ‌రిగింది. ఈ విష‌యాన్ని శ‌నివారం పోలీసులు వెల్ల‌డించారు. రాంచీకి 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హ‌న్సిదా పోలీసు స్టేష‌న్ ఏరియాలో ఉన్న కురుమ‌హ‌ట్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ టెంట్‌లో రాత్రి గ‌డుపుతున్న స్పెయిన్ టూరిస్టు జంట‌పై అటాక్ జ‌రిగిన‌ట్లు తెలిసింది.

శుక్ర‌వారం రాత్రి గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు జార్ముండి పోలీసు ఆఫీస‌ర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. సుమారు ఏడు నుంచి 8 మంది వ‌ర‌కు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి ఉంటార‌ని ఓ అధికారి తెలిపారు. ఇప్ప‌టికే ముగ్గుర్ని అరెస్టు చేశామ‌ని, మిగితా వారి కోసం వేట జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.బాధితురాలిని స్థానిక ఆస్ప‌త్రిలో చేర్పించారు.

బంగ్లాదేశ్ నుంచి టూవీల‌ర‌పై ఆ టూరిస్టు జంట ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. బీహార్ మీదుగా నేపాల్ వెళ్లాల‌ని వాళ్లు ప్లాన్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక ఎస్పీ ఇంకా స్పందించ‌లేదు.