గోరింటాకు, ధనియాలు ఆరోగ్యసిరులు

ఇంటింటి వైద్యం చిట్కాలు

Coriander- Mehndi
Coriander- Mehndi

గోరింటాకు సాధారణంగా గ్రామ ప్రాంతాల్లో అన్ని ఇళ్లల్లోనూ ఈ చెట్టు ఉంటుంది. గోరింటాకు ఇష్టపడని తెలుగింటి ఆడపడుచులెవరూ ఉండరు.

కాబట్టి ఇది ప్రసిద్ధిమైన మొక్క గోరింటాకు కేవలం చర్మానికి ఎర్రరంగును కలిగించేందుకు అనుకుంటే పొరపాటు. వైద్యపరంగా, దీనికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

ఎంతకాలానికీ మాడని పుండుపైన గోరింటాకు రుబ్బికట్టుకడితే పుండు త్వరగా మానుతుంది. గోరింటాకు ముద్దని నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను చల్లార్చి కాలిన పుండుపై తడుపుతుంటే నొప్పి, వాపు, పోట్లు తగ్గుతాయి.

నోటిపూతకు కూడా ఈ గోరింటాకు నీళ్లను మరిగించి పుక్కిలిస్తే త్వరగా తగ్గుతుంది. స్ఫోటకం, పొంగులాంటివి వచ్చినప్పుడు ఆరికాళ్లకు, అరిచేతులకు గోరింటాకు పెడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

ఈ గరింటాకులో నువ్ఞ్వల, నూనె, మునగచెట్టు బంక కలిపి పట్టువేస్తే వాపులు, నొప్పులూ తగ్గుతాయి. గోరింటాకుని ఎండబెట్టి, పొడిచేసి వొళ్లంతాపట్టిఏ్త గజ్జి, దురదలు, చిడుములాంటివి తగ్గుతాయి.

ఈ పొడికి సమానంగా నీరు కలిపి నూనెలో వేసి తైలపాకం ప్రకారం నూనె మాత్రమే మిగిలేలా కాచి ఆ నూనెను పుళ్లు, చీము కురుపులూ, గజ్జి కురుపులూ, రసికారి వాసనబట్టి ఈగలు ముసురుతున్న అన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ మీదా రెండుమూడు చుక్కలు వేస్తే వెంటనే పనిచేస్తుంది.

కాలినచోట పుండు మాడిపోయి, కొత్తచర్మం రావడానికి ఆలస్యం అవ్ఞతున్నప్పుడు, గోరింటాకుని రుబ్బి అక్కడ పట్టువేస్తే చర్మం మామూలు రంగులోకి వచ్చి కలిసిపోతుంది. కుష్ఠురోగానికి క్కూడా ఇది మంచిది.

ధనియాలు:

అభ్రకాన్ని శుద్ధి చేసేందుకు ఆయుర్వేద వైద్యులు ధనియాలని ప్రముఖంగా వాడతారు. కఠినమైన ఖనిజాల్నే శుద్ధిచేయగల శక్తి ఉన్న ఈ ధనియాలు సున్నితమైన శరీరాన్ని ఇంకెంతగా సంరక్షిస్తాయో ఊహించుకోవలసిందే.

మధుమేహం, పేగుపూత, నోటిపూత, మూత్రవ్యాధులు అతిగా దప్పిక, అజీర్తి, నెమ్ము, జలుబు, జ్వరం, శోష, ఎలర్జీ వ్యాధులన్నింటి పైనా ధనియాల ప్రభావం వ్ఞంది. చేదు, కారం వ్ఞడని విచిత్రమైన రుచివీటిది. ధనియాల్ని దంచి, నీళ్లు కలిపి గుడ్డలో వేసి పిండి తీసిన రసమే ధనియాల కషాయం.

అంటే దాహాన్ని తగ్గించి మూత్రాన్ని ఎక్కువ జారీచేసి, వంటికి పట్టిన నీరు తగ్గించే గుణం దీనికుంది. ధనియాల కషాయం తాగితే, మూత్రంలో మంట తగ్గుతుంది.

ఎప్పుడూ వేడిచేసిందంటూ బాధపడే వ్యక్తులు రోజూ దీన్ని పథ్యంగా తీసుకుంటే మూత్రంలో క్షారలక్షణాల్ని పెంచి వేడిని, ఆమ్లగుణాల్ని తగ్గించేస్తుంది. ఆగకంఉడా ఎక్కిళ్లు, వచ్చేటప్పుడు ఇది ఠక్కున ఆపుతుంది.

ధనియం గుండె జబ్బులకు పథ్యం. అజీర్తిపైన దీని ప్రభావం వేరే వివరించనవసరం లేదు. ధనయాల చారుకున్న శక్తిని అంత తేలికగా కొట్టివేయడానికి వీల్లేదు.

దగ్గు, జలుబు, ఆయా సం, వాంతులు, విరేచనాలలో ఇది అద్భుతంగా పనిచే స్తుంది. కడుపులో పాముల్ని బైటపడేస్తుంది.

ధనియాలు ఒక భాగం, ఎండించిన ముదురు చింతాకు ఒక భాగం, తగినంత ఉప్పు, కారం చేర్చి, పొడపిచేసి రోజూ అన్నంలో తింటే రక్తక్షీణత, ఆకలి తక్కువగా ఉండడం, కామెర్ల వ్యాధులకు లివర్‌ను బలపరచి రోగశాంతిని ఇస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/