సిఎం జగన్‌తో సమావేశమైన ముఖేశ్‌ అంబానీ

AP CM Jagan and Mukesh Ambani
AP CM Jagan and Mukesh Ambani

అమరావతి: ఏపి సిఎం జగన్ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ని ఆయన కలిశారు. ముఖేశ్ అంబానీ వెంట కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/