మియాపూర్‌లో కారు బీభత్సం… ఒకరు మృతి

accident
accident

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అదే వేగంతో ముందుకు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును షాపు నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/