నాతో కలిసి రండి అంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ

mudragada-padmanabham

కాపునేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14 న వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కాపు నేతలకు, ఆయన అభిమానులకు, ప్రజలకు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు.

గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి గారు పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పధకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా.

తేది 14-03-2024న వై.యస్.ఆర్.సి.పి లోకి చేరుటకు ఉదయం 8-00 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్ధిస్తున్నానండి. చిన్న మనవి, క్షమించండి ఈ ప్రయాణంలో మీ, మీ కావలసిన |ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి అంటూ లేఖ రాసారు.