తెలంగాణలో అమరరాజా పరిశ్రమ ఫై ఎంపీ విజయసాయి కామెంట్స్

తెలంగాణ లో అమరరాజా పరిశ్రమ నెలకొల్పడం ఫై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేసారు. తన పార్టీకే చెందిన ఎంపీతో సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించలేని చంద్రబాబు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావాలని ఎలా మాట్లాడగలరని నిలదీశారు. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడి పెడుతుండడం టీడీపీ నేతల అవకాశవాదానికి నిదర్శనం అని విజయసాయి విమర్శించారు.

ఏపీలో ‘అమర్ రాజా’ కంపెనీకి అనుమతులు ఇవ్వకపోవడం తో..తెలంగాణ లో ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీ ఎంపీ కంపెనీ అని జగన్ సర్కార్ పర్యావరణ నిబంధనలతో ‘అమర్ రాజా’ కంపెనీకి అడ్డంకులు పెడుతుండడంతో ఇక లాభం లేదని , తెలంగాణకు ‘అమర్ రాజా’ కంపెనీ ప్రారంభించినట్లు టీడీపీ నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న అమర్‌రాజా సంస్థకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్న కేటీఆర్‌.. అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.