‘జూలై 23.. శుక్రవారం పచ్చ పార్టీ పటాపంచలేనా?’

దేవుడు ఏం రాసిపెట్టాడో? : ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

MP Vijaysai Reddy
MP Vijaysai Reddy

Amaravati: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ”’జూలై 23.. శుక్రవారం టీడీపీకి కాలరాత్రి”’ అంటూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ”23వ తేదీ టీడీపీకి కాళ‌రాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?’”’. అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే … వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పలువురు టీడీపీ నేతలను శుక్రవారం అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇఎస్ఐ స్కాంలో అచ్చెనాయుడును గ‌తేడాది జూన్ 12, శుక్ర‌వారం అరెస్ట్, హ‌త్య కేసులో కొల్లు ర‌వీంద్రను జులై 3, శుక్ర‌వారం రోజే అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను కూడా ఏప్రిల్ 23, శుక్ర‌వారం రోజునే అరెస్ట్ చేశారు.. ఆ మ‌ధ్య చంద్రబాబుకు నోటిసులు ఇస్తూ.. 23వ తేదీనే విచారణకు రావాల‌ని ఏపీ సీఐడీ కోరింది. దీంతోమ‌రి జూలై 23 శుక్రవారం ఏం జరుగుతుందో ..అంటూ స్వయంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటం ..చర్చనీయాంశమైంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/