హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో 12 మందికి ఉరి
ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

Ongole: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకులో మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు చెప్పారు. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య వంటి పలు కేసులు ఈ గ్యాంగ్‌పై ఉన్నాయి. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ఒంగోలు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/