దక్షిణాది రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలి

న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. రాజ్యసభ జీరో అవర్ లో విజయసాయిరెడ్డి మాట్లాడారు… టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలను అడ్డుకుంటున్నారని తెలిపారు. కేంద్ర హోంశాఖ అడ్డుకోవడంపై ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. నార్త్, నార్త్ ఈస్ట్ భారత పాలసీ కాకుండా దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/