మార్చాల్సింది మీ లాంటి నాయకులనే: ప్రవీణ్‌కుమార్‌

సీఎం కెసిఆర్ వ్యాఖ్యలపై ట్వీట్ లో స్పందన

Praveen Kumar refutes CM KCR's comments
Praveen Kumar refutes CM KCR’s comments

Hyderabad: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపట్ల బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘ ఇపుడు మార్చాల్సింది మహనీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదని, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్​ లాంటి నాయకులని’ అంటూ పోస్ట్ చేశారు . దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలి ‘ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/