సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లేఖ‌

ఈ నెల నుంచి రూ.2,750 ఇవ్వాలి..ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

అమరావతి: నర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ నెల నుంచి పింఛ‌న్ల‌ను రూ.2,750కు పెంచి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. అంతేగాక‌, ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పింఛ‌న్ల డ‌బ్బులు కూడా క‌లిపి రూ.3,000 వేల చొప్పున ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చెప్పారు. పింఛ‌న్ల‌ను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతామ‌ని అప్ప‌ట్లో హామీ ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అందుకే ప్ర‌జ‌ల నుంచి వైస్సార్సీపీకి పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా హామీని నిల‌బెట్టుకోవాల‌ని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/