చంద్రబాబు నాయుడు బీసీల వ్యతిరేకి
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

కడప: రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని..రాష్ట్రానికి నిధులు రాకూడదన్నదే చంద్రబాబు దురుద్దేశ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని అన్నారు. బీసీల ఓటు బ్యాంకుతో గెలిచిన చంద్రబాబు..వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు, దళితులకు మంచి చేయకపోగా వారిని మోసం చేయడం దారుణమన్నారు. బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యోచిస్తే..దాన్ని టిడిపి అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. అమ్మఒడి, ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ, రైతు భరోసాతో రికార్డు సృష్టించామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/