ఈ ఏడాది కూడా భ‌క్తులు లేకుండానే పూరి ర‌థ‌యాత్ర‌

సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారమే జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌

భువ‌నేశ్వ‌ర్: ఈ ఏడాది కూడా భ‌క్తులు లేకుండానే.. కోవిడ్ నియ‌మావ‌ళితో పూరిలో జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌ సాగుతుంద‌ని ఒడిశా స్పెష‌ల్ రిలీఫ్ క‌మీస‌న‌ర్ ప్ర‌దీప్ కే జెనా తెలిపారు. కేవ‌లం ఆల‌య అర్చ‌కులు, కొద్ది మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌న్నారు. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది కూడా సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర సాగింది. జూలై 12వ తేదీన పూరిలో ర‌థ‌యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ర‌థ‌యాత్ర‌ను నిషేధించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/