మంత్రి ప‌ద‌వుల రేసులో లేన‌న్న ‘ఆనం’

ఏపీలో ఈ నెల 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరగబోతుంది. రేపు ప్రస్తుతం ఉన్న మంత్రులు రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందా అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మ్మెల్యేలు ఎవరికీ వారు నాకే వస్తుంది..నాకే వస్తుందని ఆశతో ఉన్నారు. అయితే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మాత్రం మంత్రి ప‌ద‌వుల రేసులో లేనని చెప్పి షాక్ ఇచ్చారు.

సొంత ప్ర‌యోజ‌నాల కోసం తాను రాజ‌కీయాల‌ను వాడుకోన‌ని చెప్పిన రామ‌నారాయ‌ణ రెడ్డి..తాను కొత్త‌గాఏమీ వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా వ్యాఖ్యానించారు. మంత్రివ‌ర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని వివ‌రాలు వెల్ల‌డించిన ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ఆమోదం త‌ర్వాతే అంద‌రికీ స‌మాచారం వ‌స్తుంద‌ని తెలిపారు. జాబితాలో ఉన్న వారికి ఫోన్ ద్వారా స‌మాచారం ఇస్తార‌ని చెప్పిన ఆనం.. తాను మాత్రం మంత్రి ప‌ద‌వుల రేసులో లేన‌ని తేల్చి చెప్పారు.

ఇక కొద్దీ సేపటి క్రితం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో జగన్ మోహన్ రెడ్డి భేటీ జరిగింది. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరుగగా.. మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి గురించి గవర్నర్‌కు వివరించిన సీఎం.. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని తీసుకునేందుకు కారణాలను వివరించారు. ఈ నెల 11న కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల గురించి కూడా సీఎం జగన్‌ గవర్నర్‌కు వివరించడం జరిగింది.