కాంగ్రెస్ 6 హామీలు..అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తాం: కోమటిరెడ్డి

mp-komatireddy-on-24-hours-power-in-telangana

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ మాటల్లోనే ఉందని.. నిజంగా అమల్లో మాత్రం లేదని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని.. ఓవైపు వాన లేక.. ఇప్పుడు విద్యుత్ లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. సిఎం కెసిఆర్‌ వైరల్ ఫివర్ నుంచి త్వరగా కోలుకుని విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించాలని కోరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్న లేనట్లే.. ఆయనకు సబ్జెక్టు లేదని విమర్శించారు.

‘కాంగ్రెస్ వాళ్లు 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ హరీశ్ రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తాం. హామీలు హమలు చేయకపోతే.. మాలాంటి వాళ్లం ప్రభుత్వం లోనుంచి వెళ్లిపోతాం. కేసీఆర్ లాగా దుబారా ఖర్చులు చేయం. ఉద్యోగుల జీతాలు 15 తారీఖున ఇస్తున్నారు. కర్ణాటకలో అమలు అవుతున్న స్కీమ్​లను.. నాతో వస్తే తీసుకెళ్లి చూపిస్తా. స్పెషల్ ఫ్లైట్ పెడుతా. బిఆర్ఎస్ మంత్రులు అందరూ రండి. చంద్రబాబు విషయం నాకు తెల్వదు…..టీవీలో వార్తలు వస్తుంటే కూడా ఛానెల్ మార్చుతుంటా . నాకు చంద్రబాబు గురించి ఆలోచించే టైం లేదు. నేను ఎంతసేపూ.. కెసిఆర్​ను గద్దె దించడంపైనే మాత్రమే ఆలోచిస్తున్నాను.’ అని కోమటిరెడ్డి అన్నారు.