ఆదిపురుష్ ఫై మహారాష్ట్ర మంత్రి మిశ్రా ఆగ్రహం

ఆదిపురుష్..ఆదిపురుష్ ఇప్పుడు ఎక్కడ చూడు ఈ చిత్రం గురించే..బాహుబలి , సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో నార్త్ లోను సత్తా చాటిన ప్రభాస్..ఇప్పుడు ఆదిపురుష్ అంటూ రామాయణ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఆదివారం విడుదలైన టీజర్ ఒక్కసారిగా సినిమాను విమర్శల పాలుచేసింది. టీజర్ చూస్తుంటే కార్టున్ వీడియో చూసినట్లు ఉందని ప్రభాస్ అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదమైంది. “బాయ్​కాట్ ఆదిపురుష్​” నినాదం అందుకున్నారు. రాముడికి మీసాలేంటి? : శ్రీరాముడి చిత్రపటాల్లోనూ.. దేవాలయాల్లోనూ మీసాలు కనిపించవు. రాముడికి మీసాలు ఉన్నట్టు ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా చూడలేదు. వినలేదు. ఇప్పటి వరకూ వివిధ భాషల్లో తెరకెక్కిని ఏ సినిమాలోనూ.. శ్రీరాముడి పాత్రధారుడికి మీసాలు లేవు. మరి, ఇప్పుడు ఆదిపురుష్​లో ప్రభాస్ కు మీసాలు పెట్టడమేంటి? అనే విమర్శలు చేస్తున్నారు బిజెపి నేతలు.

బిజెపి అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్​​ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు! వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు! అయితే.. “ఆదిపురుష్”​లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు! మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి! లెజెండ్ ఎన్​టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?” అంటూ ట్వీట్​ చేశారు.

తాజాగా.. మహారాష్ట్ర మంత్రి మిశ్రా .. బ్రాహ్మడైన రావణుడిని దారుణంగా చూపించారని మండిపడ్డారు. ఆ పాత్రధారి సైఫ్ అలీఖాన్.. అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబులా ఉన్నాడని.. హనుమంతుడికి తోలు దుస్తులు (లెదర్) తొడిగారని, ఫైర్ అయ్యారు. ఆదిపురుష్ టీజర్ హిందువులకు వ్యతిరేకంగా ఉందని, సినిమాలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని దర్శకుడికి లేఖరాసినట్టు చెప్పారు. ఇలా.. “ఆదిపురుష్” టీజర్​ పై మిక్స్​డ్ టాక్ నడుస్తోంది. మరి, సినిమా ఎలా ఉండబోతోంది? నెగెటివ్ కామెంట్లకు చెక్ పెడుతుందా? మరిన్ని కామెంట్స్​కు ఛాన్స్ ఇస్తుందా?? అన్నది చూడాలి.