కోవిడ్-19 పై టాలీవుడ్ హీరోల వీడియో సాంగ్

సోషల్ మీడియాలో వైరల్ 

ప్రస్తుతం  కరోనా  పరిస్థితి మరింతగా విషమిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు చెబుతూ ఒక పాటతో పలువురు నటులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు

సంగీత దర్శకుడు కోటి ఈ పాటను ట్యూన్ చేసి పాడాడు. కోటి పాటకు చిరంజీవి.. నాగార్జున.. వరుణ్ తేజ్ .. సాయి ధరమ్ తేజ్ లు వారి వారి ఇంట్లో ఉండి కవర్ వీడియోను చేశారు.

ఈ అయిదుగురి విజువల్స్ ను ఆకర్షనీయంగా ఎడిట్ చేసి పాటగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనాతో జాగ్రత్త. ముందస్తు చర్యగా ఇంట్లోనే ఉండటంతో పాటు చేతులు విధిగా కడుక్కుంటూ పరిశుభ్రతను పాటిద్దాం అంటూ పాట సాగింది.

వి గోనా ఫైట్ విత్ కరోనా అంటూ సాగిన ఈ పాటతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున ఇంకా ఇతర స్టార్స్ ను నెటిజన్స్ అభినందిస్తున్నారు.

ఈ సమయంలో ప్రతి ఒక్కరి అవగాహన కోసం ఏదో ఒక మార్గంలో చెప్పేందుకు ప్రయత్నించాలి. ఇలా పాట రూపంలో జనాల్లోకి తీసుకు వెళ్లడం వల్ల ఎక్కువ మందికి మెసేజ్ చేరుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/