ర‌సాయ‌న‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి

Moungi Bawendi, Louis Brus and Alexei Ekimov win Nobel Prize in Chemistry

స్టాక్‌హోమ్‌: ర‌సాయ‌శాస్త్రంలో ఈరోజు ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తి విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. ఆ అవార్డు ఈసారి ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించింది. మౌంగి జీ బావెండి, లూయిస్ ఈ బ్రుస్, అలెక్సి ఐ ఎకిమోవ్‌ల‌కు ర‌సాయ‌శాస్త్రంలో 2023 నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కిన‌ట్లు ఇవాళ ద రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ప్ర‌క‌టించింది. క్వాంట‌మ్ డాట్స్ విశ్లేష‌ణ‌, ఆవిష్క‌ర‌ణ‌లో ఆ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది. నానో పార్టిక‌ల్స్ డెవ‌లప్మెంట్ లోనూ శాస్త్ర‌వేత్త‌లు ముఖ్య భూమికి నిర్వ‌ర్తించారు.

క్వాంట‌మ్ డాట్స్‌, నానో పార్టిక‌ల్స్‌కు విశిష్ట‌మైన గుణాలు ఉన్నాయ‌ని, టీవీ స్క్రీన్లు, ఎల్ఈడీ బ‌ల్బుల్లో వెలుతురు వ్యాప్తికి ఆ పార్టిక‌ల్సే కార‌ణ‌మ‌ని క‌మిటీ తెలిపింది. ఆ పార్టిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే ర‌సాయ‌న‌క చ‌ర్య‌లు, వాటి నుంచి ప్ర‌స‌రిస్తున్న వెలుతురు వ‌ల్ల వైద్యులు క‌ణ‌తుల‌కు ఈజీగా శ‌స్త్ర చికిత్స చేస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. క్వాంట‌మ్ డాట్స్ ద్వారా ప‌రిశోధ‌కులు క‌ల‌ర్డ్ లైట్‌ను సృష్టించిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే క్వాంట‌మ్ క‌మ్యూనికేష‌న్ కోసం క్వాంట‌మ్ డాట్స్ కీల‌కం కానున్న‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.