పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

cabinet-green-signal-for-national-turmeric-board-and-tribal-university-in-telangana

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ కు కృష్ణానీటి కేటాయింపు పై క్యాబినెట్లో నేడు చర్చలు జరిగాయి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ఆమోదం తెలిపింది. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య నీటిని కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశించింది . తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాల సమస్య పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.