ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు..
ప్రమాదాలు – ప్రథమ చికిత్స

ఇంట్లో ఏ ట్యూబ్ లైట్ వెలగక పోతేనో లేదా ఏదో ఒక ఉపకరణం పని చేయనప్పుడో ఎలక్ట్రిక్ వైర్లను ముట్టుకోవాల్సి రావచ్చు. ఇక్కడైనా ఇన్సులేషన్ సరిగా లేక షాక్ తగలవచ్చు. అలాంటప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స సూచనలివి..
కరెంట్‌సాక్‌కు గురైన వ్యక్తిని ఎలక్ట్రిక్ కరెంట్ ప్రవహిస్తున్న (ఫ్లో అవుతున్న) వైర్‌నుంచి వేరు చేయాలి. ఇందుకు మెయిన్ ఆఫ్ చేయడమే మంచి మార్గం.
- షాక్‌కు గురైన వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉంటే ముందుగా వారి స్థిమిత పడేలా ధైర్యం చెప్పాలి. వారికి ఏమీ జరగలేదనే భరోసా ఇవ్వాలి. దాంతో వారు బాగా తేరుకుంటారు.
షాక్‌కు గురైన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే ముందుగా నాడి (పల్స్) చూడాలి. పల్స్ అందకుండా ఉంటే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సిపిఆర్) చేయాలి అంటే శ్వాస ఆగిపతే నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి.
గుండె స్పందనలు ఆగిపోయినట్లు గమనిస్తే మన ఒత్తిడి ఛాతీ మీద కనీసం రెండు అంగుళాలలోతుకు పడేట్లుగా ఛాతిపైన చేతులు ఉంచి మెల్లగా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఈ రెండు పనులు చేస్తూ వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.
ఎలక్ట్రిక్ షాక్ వల్ల కాలిన గాయాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. వాటిని ఎలక్ట్రిక్ బర్న్ అటారు. ఆటికి అయంట్‌మెంట్స్‌గాని, పూతమందులు గాని రాయకూడదు.
ఎలక్ట్రిక్ షాక్‌కు గురైన వారు సాధారణంగా ఎత్తు నుంచి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆకస్మాత్తుగా కదలించకూడదు. గాయాలను బట్టి ప్రథమ చికిత్స చేయాలి.
షాక్‌కు గురైన వారికి గుండె స్పందనల్లో తేడా రావచ్చు దాని వెంట్రిక్యులార్ అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించడం సాధ్యం. కాబట్టి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాటు చేయాలి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/