జగన్‌ గారూ..హీరో రామ్‌ కీలక వ్యాఖ్యలు

జగన్ ను తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడి

Hero Ram

హైదరాబాద్‌: టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపి సిఎం జగన్‌ గారూ.. పెద్ద కుట్ర జరుగుతోన్నట్టుంది అంటూ ట్వీట్ చేసి తీవ్ర కలకలం రేపారు. ‘సిఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, ‘ఏపి గమనిస్తోంది’అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/