రెండు రోజులు గోవాలో పర్యటించనున్న మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జి వ‌చ్చేవారం గోవాలో ప‌ర్య‌టించ‌నున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆమె అక్టోబ‌ర్ 28న గోవాకు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత శుక్ర‌వారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వచ్చే ఏడాది ఆరంభంలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఈ నేప‌థ్యంలో గోవాలో మ‌మ‌తా బెన‌ర్జి ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.

ఇటీవ‌ల జ‌రిగిన ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిల‌బెట్టుకుంది. ఇప్పుడు చిన్న రాష్ట్రాలైన త్రిపుర‌, గోవాల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని ఆ పార్టీ భావిస్తున్న‌ది. ఆ మేర‌కు ప్ర‌ణాళికాబ‌ద్దంగా పావులు క‌దుపుతున్న‌ది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/